Women protest for drinking water: దాహం వేస్తోందంటూ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. ఆ కేకలు ప్రభుత్వానికి వినిపించలేదు. దీంతో.. మహిళలు రోడ్డెక్కి నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని దేవాంగ్ నగర్ కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులను నిలిపి వేశారంటూ.. రహదారిపై చెట్టు మొద్దులు పెట్టి రాకపోకలను నిలిపివేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తమ కాలనీని పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరపంచాయతీ అధికారులు, పోలీసులు మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. చివరకు గంటలో నీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులను చేయిస్తానని ఛైర్మన్ హామీ ఇవ్వడంతో.. ఎట్టకేలకు నిరసన విరమించారు.
ఇవీ చదవండి :