ETV Bharat / state

Road Blocked : ధ్వంసమైన రోడ్లపై.. ముళ్ల కంచెలు వేసి

రోడ్లు అధ్వానంగా మారినా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలోని శంఖవరం మహిళలు. ముళ్ల కంపను రోడ్డుకు అడ్డంగా(Roads Blocked) వేసి రాకపోకలను అడ్డగించారు.

Road Blocked
మా ఊరి రోడ్లు పట్టించుకోరా..?
author img

By

Published : Nov 24, 2021, 8:46 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి శివారులోని శంఖవరంలో రహదారి అధ్వానంగా తయారైందంటూ.. రోడ్డుపై ముళ్లకంచెలు వేసి మహిళలు నిరసన (Women Protest against worst roads) తెలిపారు. కొన్ని నెలలుగా రహదారి గుంతలమయమై.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

వర్షానికి రహదారి మరింత బురదమయంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో.. దోమలు ఎక్కువై రోగాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ రహదారిపై పెద్దఎత్తున ముళ్లకంచెలు వేసి రాకపోకలను అడ్డుకున్నారు.

శివారు ప్రాంతం కావడంతో అధికారులు అసలు పట్టించుకోవట్లేదని, వీధిలైట్లు వెలగపోయినా, దోమల బెడద ఉందని చెప్పినా వినడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : ప్రభుత్వమే తమను ఆదుకోవాలి: చేనేత కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.