ETV Bharat / state

Woman Murder: ట్రాక్టర్‌తో ఢీకొట్టి ఓ మహిళ ప్రాణం తీసిన వైసీపీ నాయకుడు - TDP activist Wife murdered

Woman Murder With Tractor: ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు బరితెగించారు. ట్రాక్టర్‌తో ఢీకొట్టి ఓ మహిళ ప్రాణం తీశారు. దారుణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన మృతురాలి కుమార్తెపైనే..దాడి చేసి గాయపరిచారు.

Woman Murder
Woman Murder
author img

By

Published : Jun 5, 2023, 4:38 PM IST

Updated : Jun 6, 2023, 6:24 AM IST

Woman Murder With Tractor: పొలం విషయంలో ఉన్న వివాదం కారణంగా అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నా ఓ మహిళను ట్రాక్టర్ తో ఢీకొట్టి వెసీపీకి చెందిన కొండల్ రావు అనే వ్యక్తి హత్య చేశారని స్థానికులు తెలిపారు. అంతే కాకుండా మృతురాలి కూతురు పైన కూడా దాడి చేసి గాయపరిచినట్లు తెలుస్తోంది. మృతురాలి భర్త తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉండటం సహించలేక మహిళపై దాడి చేసి హత్య చేశారని ఆరోపిస్తున్నారు.

ట్రాక్టర్‌తో ఢీకొట్టి ఓ మహిళ ప్రాణం తీసిన వైసీపీ నాయకుడు

ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం టీడీపీ, వైసీపీ మధ్య ఓ వైపు.. గొడవలు జరుగుతుండగా మరోవైపు తెలుగుదేశం నాయకుడు భార్య మృతి చెందడం తీవ్ర విషాదం రేపింది. వైసీపీకి చెందిన నాయకులు ట్రాక్టర్‌తో ఢీ కొట్టి హత్య చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నాయకుడు సుధాకర్ భార్య హనుమాయమ్మ టంగుటూరు మండలం రాయవారిపాలెంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వైసీపీ నాయకులు పిలుపునివ్వడంతో...ఎమ్మెల్యేకు మద్దతుగా సుధాకర్ డోలా స్వగ్రామమైన నాయుడుపాలెం వెళ్లారు. అదే సమయంలో రాయవారిపాలెంలో విధులు నిర్వహిస్తున్న హనుమాయమ్మపై..సమీప బంధువైన వైసీపీ నాయకుడు కొండలరావు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ట్రాక్టర్ ఢీ కొట్టడంతో ప్రహరీ కూడా కూలిపోయిందని..వాటి శిథిలాల కింద హనుమాయమ్మ ఉండగానే..ట్రాక్టర్‌ను వాటి మీదుగా పోనిచ్చారని మృతురాలి కుమార్తె కన్నీటి పర్యంతమయ్యారు. అడ్డుకునేందుకు యత్నించిన తనపైనా దాడి చేశారని చెప్పారు. తీవ్రంగా గాయపడిన హనుమాయమ్మను అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. పొలం విషయంలో కొండలరావు కుటుంబానికి తమకు వివాదం ఉందని దీనికి తోడు తాను తెలుగుదేశం పార్టీలో చురుగ్గా ఉండటం సహించలేని తన భార్యపై దాడి చేసి హత్య చేశారని ఆమె భర్త సుధాకర్ ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ హత్యేనని ఎమ్మెల్యే స్వామి ఆరోపించారు.

మా అమ్మ అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే దగ్గర ఏదో పనుందని మా నాన్న వెళ్లారు. అదే సమయంలో రాయవారిపాలెంలో విధులు నిర్వహిస్తున్న మా అమ్మని..సమీప బంధువైన వైసీపీ నాయకుడు కొండలరావు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారు.- మృతురాలి కుమార్తె

తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పని చేస్తున్న కార్యకర్త సుధాకర్ భార్య, అంగన్వాడీ టీచరైన హనుమాయమ్మని వైసీపీకి చెందిన నాయకులు ట్రాక్టర్‌తో ఢీ కొట్టి హత్య చేశారు. హత్య చేసినవారు కొండల్ రావు. ప్రశాంతంగా ఉండే కొండపి రాజకీయాల్లో ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తెరతీశారని ఎమ్మెల్యే మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరుతున్నాను.-స్వామి, టీడీపీ ఎమ్మెల్యే

Last Updated : Jun 6, 2023, 6:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.