ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం వైకాపాలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. వేటపాలెం మండలం బచ్చులవారిపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం అందుకు వేదికైంది. స్థలాలు లబ్ధిదారులకు అందజేయనుండగా.. వారు నివేశన స్థలాల వద్దకు చేరుకున్నారు. కొద్ది సేపటి తరువాత మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత వచ్చి వేదికపై కూర్చుని నిరీక్షిస్తున్నారు. అనంతరం వచ్చిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సభా ప్రాంగణానికి రాకుండా.. సరాసరి స్థలాల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణి చేసి వెళ్లిపోయారు.
తాను మాజీ ఎమ్మెల్సీనని కనీస మర్యాద లేకుండా కార్యక్రమాన్ని ముగించడం ఏమిటని.. వేటపాలెం ఎమ్మార్వో మహేశ్వరరావుపై పోతుల సునీత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విధంగా ప్రవర్తిస్తే సీఎం జగన్కు చెడ్డపేరు వస్తుందంటూ మండిపడ్డారు. ఘటనకు కారణమైన ఎమ్మెల్యే కరణం బలరామ్ను దూషించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. చీరాల డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వందమందికి పైగా పోలీసులు భారీబందోబస్తు నిర్వహించారు.
ఇదీ చదవండి: