Leakage from Mopadu Reservoir: ప్రకాశం జిల్లా పామూరు మండలంలో మోపాడు రిజర్వాయర్ కట్ట కింది భాగంలో లీకవుతోంది. దీంతో 5గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. జిల్లాలో సోమ, మంగళవారాల్లో కురిసిన భారీ వర్షాలకు మోపాడు రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. దీనికితోడు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 2.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
కాగా, ఈ ఉదయం నుంచి రిజర్వాయర్ కట్టకు అడుగు భాగంలో ఐదు చోట్ల నీరు లీకవుతోంది. గమనించిన స్థానికులు, రైతులు వెంటనే నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ రిజర్వాయర్ కింద సుమారు 20వేల ఎకరాలు సాగవుతున్నాయి. నీరు లీకవుతుండటంతో రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు.
మరోవైపు జిల్లాలోని పామూరు పాత చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉండడంతో జేసీ వెంకటమురళి, అధికారులు చర్యలు చేపట్టారు. అలుగు పారుతున్న నీరు 565 జాతీయ రహదారిపైకి వచ్చి గోపాలపురం ఎస్సీకాలనీని ముంచేసింది. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇదీ చదవండి:
Rallapadu Project: రాళ్లపాడు ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద.. ఐదు గేట్ల ద్వారా నీటి విడుదల