Concerns at Nellore RDO office: తమకు న్యాయం చేయాలంటూ.. నెల్లూరు పట్టణం నక్కా గోపాల్ నగర వాసులు అర్థరాత్రి నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రియల్టర్లు తమ నివాసాలను ధ్వంసం చేయడంతో ఉండేందుకు ఇళ్లు లేక ఆర్డీవో కార్యాలయానికి రావాల్సి వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో నిద్రించిన బాధితులను అధికారులు ఓ కల్యాణ మండపానికి పంపించారు. అయితే మండపంలో కార్యక్రమాలు ఉన్నాయని చెప్పడంతో వాళ్లు అక్కడినుంచి ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు.
ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో అర్థరాత్రి నెల్లూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆదోళన చేపట్టారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకొని.. తమ ఇళ్లు తమకు ఇప్పించాలని కోరారు. అధికారులు న్యాయం చేయకుంటే ఆమరణ దీక్ష చేపడుతామని టీఎన్ఎస్ఎఫ్ నగర అధ్యక్షుడు ఆశిఫ్ హెచ్చరించారు.
ఇదీ చదవండి..
FAKE CURRENCY: నకిలీ నోట్ల చలామణి కేసులో మరో నలుగురి అరెస్ట్