ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలో పుల్లలచెరువు గ్రామ సమీపంలో గంగవరం వెళ్లే రహదారి పక్కన ఉన్న పొదల్లో పడి ఉన్న ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా... ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పరిశీలించారు. గాయాలతో పొదల్లో పడి ఉన్న మృతుడు.. తెలుపు రంగు చొక్కా, జీన్స్ ధరించాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: