తిరుమల శ్రీవారిని ప్రసాదాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులో విక్రయిస్తున్నారు. తితిదే కళ్యాణమండపం ఆవరణలో కౌంటర్లు ఏర్పాటు చేసి, విక్రయాలు ప్రారంభించారు. ఒంగోలు కేంద్రానికి 20 వేల లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంచారు. ఒకోలడ్డూను రూ.25 చొప్పున విక్రయిస్తున్నారు. లాక్ డౌన్ సందర్భంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ.. భక్తులు పెద్ద ఎత్తున ప్రసాదం కొనేందుకు బారులు తీరారు.
శ్రీవారి ప్రసాదాన్ని ఇలా తిరుమలలో కాకుండా... బహిరంగంగా విక్రయించడంపై కొంతమంది విమర్శిస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ ప్రసాదం విక్రయిస్తే.. తిరుమల శ్రీవారి లడ్డూకు ఉన్న విలువ, పవిత్రత పోతుందని తితిదే ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు, కొండెపీ ఎమ్మెల్యే బాల వీరాంజయే స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానాలని కోరారు.
ఇదీ చదవండి: