ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో నాలుగు ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. మూడు ఇళ్లల్లో యజమానులు వేరే ఊరు వెళ్లడంతో తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈ ఇళ్లల్లో 60 సవర్ల బంగారం, 50 వేల రూపాయలు నగదు చోరీకి గురయ్యాయని బాధితలు తెలిపారు. ఈ దొంగతనాలకు ఇద్దరు యువకులు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇద్దరు యువకులు గోడ దూకి వెళుతున్న దృశ్యాలను దుకాణం సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: