ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అయ్యపరాజుపాలెంలోని రమాదేవి అనే మహిళ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. రమాదేవి సొంత బంధువే దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. కేసు వివరాలను ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ వివరించారు. చీమకుర్తి బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితురాలి నుంచి రూ.2లక్షల 40 వేలు విలువచేసే 8 సవర్ల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో పోలీసుల నిర్బంధ తనిఖీలు