ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్దకు ప్రజలు బారులు తీరారు. కరోనా భయాన్ని కూడా లెక్క చేయకుండా గుమిగూడారు. ప్రభుత్వ పథకాల వర్తింపు కోసం ఆధార్‌కు ఫోన్ నంబర్ అనుసంధానం తప్పని సరిచేసిన కారణంగా.. ఈ పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి క్యూలో ఉన్నామని లబ్ధిదారులు అంటున్నారు. ఇలా అధిక సంఖ్యలో గుమిగూడుతున్న కారణంగా... కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు వాపోతున్నారు.
కొన్ని గ్రామాల్లో మీసేవా కేంద్రాలు లేని కారణంగా.. బ్యాంకుల వద్దే గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తుందని పలువురు గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామ, వార్దు సచివాలయాల్లోనే ఆధార్‌కు ఫోను నంబర్ అనుసంధానం చేసే విధంగా ఏర్పాటు చేస్తే తమకు ఈ ఇబ్బందులు తప్పుతాయని అభిప్రాయపడ్డారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. కొవిడ్ వ్యాప్తిని నిరోధించవచ్చని చెప్పారు.
ఇదీ చదవండి: