ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు కన్నుల పండువగా జరిగాయి. వేద పండితులు వెంకట శేషాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వ్రతాలు చేసిన భక్తులకు... స్వామి వారి జీవిత చరిత్రను కథల రూపంలో పండితులు తెలియజేశారు. జిల్లా పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నదానం నిర్వహించారు. నవధాన్యాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామస్మరణతో దేవాలయ పరిసర ప్రాంతాలు మార్మోగాయి.
ఇదీ చదవండికందుకూరు మార్కెట్ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం