ETV Bharat / state

గోడల మధ్య ఇరుక్కున్న చిన్నారి.. రక్షించిన అగ్నిమాపక సిబ్బంది - ఒంగోలు తాజా వార్తలు

ఆడుకుంటూ వెళ్లిన ఓ చిన్నారి రెండు గోడల మధ్య ఇరుక్కుపోయింది. బయటకు రాలేక నరకయాతన పడింది. అగ్నిమాపక సిబ్బంది స్పందించి పాపను సురక్షితంగా కాపాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఘటన వివరాలివి..!

The girl, who was trapped between two walls, was rescued by firefighters in ongole

author img

By

Published : Jul 23, 2020, 5:25 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలులో రెండు గోడల మధ్య చిక్కుకుపోయిన చిన్నారిని అగ్నిమాపక సిబ్బంది చాకచక్యంగా కాపాడారు. ఇందిరమ్మ కాలనీ రెండో లైన్​లో మీనాక్షి అనే ఆరేళ్ల బాలిక ఆడుకుంటూ రెండు గోడల మధ్యకు వెళ్లింది. ఇరుకైన గోడలు కావడం వల్ల తిరిగి రాలేక అవస్థ పడింది.

ఆ చిన్నారి పరిస్థితిని గమనించిన స్థానికులు... అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది హుటాహుటిన వచ్చి.. ఒక ఇంటి గోడను పగలగొట్టి చాకచక్యంగా బాలికను బయటకు తీశారు. దాదాపు గంటసేపు శ్రమించి చిన్నారిని బయటకు తీసుకురావటంతో అంతా ఊపిరి తీసుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కృషిని స్థానికులు అభినందించారు.

ఇదీ చదవండి

పశ్చిమగోదావరిలో రూ.20 లక్షల విలువైన మద్యం స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.