TDP YCP Concerns: తెలుగుదేశం, వైసీపీ నేతల పరస్పర విమర్శలు, పోటాపోటీ నిరసనలతో ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కొండపి టీడీపీ ఎమ్మెల్యే డోలా వీరాంజనేయస్వామిపై అవినీతి ఆరోపణలు చేస్తూ....వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వరికూటి అశోక్ బాబు...ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో మరుగుదొడ్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ అశోక్ బాబు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు నాయుడుపాలెంలోని డోలా వీరాంజనేయస్వామి ఇంటికి వెళ్లేందుకు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది.
నాయుడుపాలెంలోని ఎమ్మెల్యే డోలా ఇంటి ముట్టడికి అధికార పార్టీ శ్రేణులు... టంగుటూరు వైసీపీ కార్యాలయం నుంచి సిద్ధమవుతుండగా పోలీసులు....కార్యాలయం వద్ద భారీగా బలగాలు మోహరించారు. ఇదే సమయంలో వైసీపీ తీరుకు నిరసనగా ఎమ్మెల్యేకు మద్దతుగా టీడీపీ నేతలు డోలా ఇంటికి చేరుకున్నారు. టంగుటూరులోని వరికూటి అశోక్‌బాబు ఇంటి ముట్టడికి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బయల్దేరారు. 16వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు అదుపులో తీసుకుంటున్న సమయంలో ఎమ్మెల్యే చొక్కా చిరిగింది. అరెస్టును నిరసిస్తూ ఎమ్మెల్యేను తీసుకెళ్తున్న వాహనాన్ని టీడీపీ కార్యకర్తలు వెంబడించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ నేత వరికూటి అశోక్ బాబును నాయుడుపాలెం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు టంగుటూరులో అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా గొంతు నొక్కేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ కక్ష సాధింపు చర్యల్ని తీవ్రంగా ఖండించారు. డోలా అరెస్టు.. జగన్ ప్రభుత్వ సైకోయిజానికి నిదర్శనమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
CBN Tweet: కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి గారిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాడు అసెంబ్లీలో దాడి నుంచి నేటి అక్రమ అరెస్టు వరకు.....ప్రతి చర్య దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రేనని ధ్వజమెత్తారు. తమ పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అహంకార ధోరణిని దళిత సమాజం గమనిస్తోందని... మీకు బుద్ది చెప్పడానికి సిద్దం అయ్యిందని చెప్పారు. నా సోదరుడు స్వామి మీ అక్రమ అరెస్టులకు, వేధింపులకు భయపడే నేత కాదని. ఎదిరించి పోరాడే నాయకుడని హెచ్చరించాడు. పోలీసులు వైసీపీ క్రియాశీల కార్యకర్తల్లా కాకుండా... చట్టబద్దంగా వ్యవహరించాలి. వెంటనే స్వామిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
-
కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి గారిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నాడు అసెంబ్లీలో దాడి నుంచి నేటి అక్రమ అరెస్టు వరకు.....ప్రతి చర్య దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రే. తమ పట్ల వైసీపీ ప్రభుత్వం… pic.twitter.com/ExboJaVHIR
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి గారిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నాడు అసెంబ్లీలో దాడి నుంచి నేటి అక్రమ అరెస్టు వరకు.....ప్రతి చర్య దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రే. తమ పట్ల వైసీపీ ప్రభుత్వం… pic.twitter.com/ExboJaVHIR
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2023కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి గారిపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. నాడు అసెంబ్లీలో దాడి నుంచి నేటి అక్రమ అరెస్టు వరకు.....ప్రతి చర్య దళిత నాయకుడైన స్వామి గొంతు నొక్కేందుకు ఈ ప్రభుత్వం చేస్తున్న కుట్రే. తమ పట్ల వైసీపీ ప్రభుత్వం… pic.twitter.com/ExboJaVHIR
— N Chandrababu Naidu (@ncbn) June 5, 2023
నేను పోలీసులకు ఒకటే చెప్తున్నా మీరు రాజ్యాంగ బద్ధంగా నడుచుకోండి.. అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరించొద్దు మీరు హౌస్ అరెస్ట్ అయిన వ్యక్తిని ఎలా బయటికి తీసుకొస్తారు మీరు..?- డోలా వీరాంజనేయస్వామి, టీడీపీ ఎమ్మెల్యే