ETV Bharat / state

'రాష్ట్ర రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలి' - tdp bike rally news in podhili

మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ పొదిలిలో భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. శాసనమండలిని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్​.. ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రద్దు చేయరనే గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు.

అమరావతికి మద్దతుగా పొదిలిలో భారీ బైక్​ ర్యాలీ
అమరావతికి మద్దతుగా పొదిలిలో భారీ బైక్​ ర్యాలీ
author img

By

Published : Jan 25, 2020, 12:15 PM IST

అమరావతికి మద్దతుగా పొదిలిలో తెదేపా నేతల బైక్​ ర్యాలీ

ప్రకాశం జిల్లా పొదిలిలో తెదేపా నేత కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మూడు రాజధానుల ప్రతిపాదనకు వ్యతిరేకంగా భారీ బైక్​ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అడ్డ రోడ్డు నుంచి కాటూరివారిపాలెం వరకు చేపట్టిన ర్యాలీలో మూడు రాజధానులు వద్దు.. అమరావతే ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ఉద్ధృతం చేస్తామన్నారు. శాసనమండలిని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్​.. ఆరోగ్యశ్రీ వంటి పథకాలను రద్దు చేయరనే గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. మార్కాపురం నియోజకవర్గంలోని తెదేపా, సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

'ప్రభుత్వ తీరు మారకుంటే.... నేతల ఇళ్ల ముట్టడి'

Intro:AP_ONG_85_24_AMARAVATHI_BYKE_RYALY_VO_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనివాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దు అంటూ ప్రకాశం జిల్లా పొదిలి లో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. తెదేపా నేత మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆద్వర్యం ఈ ర్యాలీ నిర్వహించారు. పొదిలి లోని అడ్డ రోడ్డు నుండి ప్రధాన వీది గుండా కాటూరివారిపాలెం వరకు ర్యాలీ కొనసాగింది. మార్కాపురం నియోజక వర్గం లోని తెదేపా, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ కు ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఉండాలన్నారు. మూడు రాజధానులు అంశం వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకెళ్లి ఉదృతం చేస్తామన్నారు. ఆ రోజు చట్ట సభల్లో అమరావతిని ఒప్పుకున్న మీరు.....ఈ రోజు ఊసరవెల్లి మాదిరిగా మాటలు మారుస్తున్నారని విమర్శించారు. 28 వేల మంది రైతుల త్యాగ ఫలితమే ఈ అమరావతని ఎట్టి పరిస్థితుల్లో మార్చేదానికి ఒప్పుకోమన్నారు. శాసన మండలి లో షరీఫ్ గారు న్యాయంగా తీర్పు చెబితే ఆయన పైనే దాడికి పాల్పడే స్థాయికి వచ్చిందన్నారు. మీ నాన్న ప్రవేశ పెట్టిన శాసన మండలి ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్న మీరు......ఆరోగ్య శ్రీ వంటి పధకాలను కూడా రద్దు చేయవనే గ్యారంటీ ఏంటని ఆయన ప్రశ్నించారు.

బైట్: కందుల నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మార్కాపురం.

Body:భారీ....ర్యాలీ.

Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.