ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పనితీరును స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో పరిశీలించారు. విద్యార్థులకు పెట్టే ఆహారాన్ని తహసీల్దార్ పుల్లారావు రుచి చూశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందిస్తున్నారా లేదా అని ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు. పథకం అమలులో ఉన్న సమస్యల గురించి ఆరా తీశారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు...తహసీల్దార్‌కు చెప్పారు. అయితే కోడిగుడ్లను సరఫరా చేసే కాంట్రాక్టర్... సకాలంలో వాటిని అందించడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులకు కోడిగుడ్లను సకాలంలో అందించలేకపోతున్నామని వివరించారు.
ఇదీ చదవండి: కూలిన తిరుపతి గరుడ వారధి ఫ్లైఓవర్..తప్పిన పెను ప్రమాదం