ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున.. పోలీసులు ఆంక్షలను కఠినతరం చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యవసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఔషధ దుకాణాలు తెరిచి ఉంటాయని అధికారులు చెప్పారు.
పట్టణంలోకి వచ్చే వాహనాలను.. ఆంక్షల కారణంగా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఒకటో పట్టణ ఎస్ఐ సురేశ్ ఆధ్వర్యంలో రహదారుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అనవసరంగా రోడ్ల పైకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇదీచదవండి.