రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో కొత్తగా సిటీ స్కానర్‌ను ప్రారంభించారు. దీర్ఘకాలంగా ఇక్కడ సీటీ స్కాన్ సమస్య నెలకొంది. పాత స్కానర్ పనిచేయకపోవటంతో రెండేళ్ల నుంచి రోగులకు ఇబ్బందిగా మారింది. ఈ నూతన యంత్రాన్ని ప్రారంభించటంతో రోగులకు ఉపశమనం కలగనుంది. రోగులు ఇక బయటికి వెళ్లి స్కానింగ్ తీయించుకునే అవకాశం లేకుండా ఆసుపత్రిలోనే ఉచితంగా ఈ పరీక్ష చేస్తారు.
స్కానింగ్‌కు లైసెన్సు అవసరం ఉందని, ఇది రెండు, మూడు రోజుల్లో వస్తుందని, ఇది రాగానే సేవలు అందిస్తామని మంత్రి బాలినేని పేర్కొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పోలా భాస్కర్, జేసీ చేతన్, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. పెరుగుతున్న కేసులు...తగ్గుతున్న ప్రయాణికులు