ETV Bharat / state

మృతదేహంపై కుక్కల దాడి ఘటనపై విచారణ

author img

By

Published : Aug 13, 2020, 9:10 AM IST

ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం బిట్రగుంటకు చెందిన విశ్రాంత గ్రామ సహాయకుడు కాంతారావు మృతదేహంపై ఒంగోలు జీజీహెచ్​లో కుక్కలు దాడి చేసిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కమిటీ సభ్యునిగా గుంటూరు వైద్యశాళకు చెందిన మత్తు వైద్యనిపుణుడిని నియమించారు.

state government appointed committee at ongole ggh dead body dog bite
గుంటూరు జీజీహెచ్​లో మృతదేహంపై దాడి ఘటనపై విచారణ

ప్రకాశం జిల్లా ఒంగోలులోని సర్వజన ఆసుపత్రి ఆవరణలో కాంతారావు అనే వ్యక్తి మృతదేహంపై కుక్కలు దాడిచేసిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కమిటీ సభ్యులుగా గుంటూరు వైద్యశాలకు చెందిన మత్తు వైద్యనిపుణుడు కిరణ్‌, విజయవాడ కళాశాలకు చెందిన ప్రొఫెసర్‌ భీమేశ్వరరావులను నియమించారు. వారు బుధవారం జీజీహెచ్‌కి వచ్చి సూపరింటెండెంట్‌ శ్రీరాములు సమక్షంలో పలు వివరాలు సేకరించారు. బాధిత కుటుంబసభ్యులతోనూ మాట్లాడారు. ఈ నెల 5న కాంతారావు అనే కొవిడ్‌ రోగి ఆసుపత్రికి వచ్చినట్లు గుర్తించారు. ఇన్‌పేషంట్‌గా చేరకుండా వెళ్లినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో 10వ తేదీన కార్లషెడ్డు వద్ద ఆ వ్యక్తి మృతదేహంపై కుక్కలు దాడి చేస్తుండగా గుర్తించిన ఆసుపత్రి సిబ్బంది శవాన్ని మార్చురీకి తరలించారు.

ఇదీ చదవండి :

కొవిడ్ బాధితుడి మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.