ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసు ఆర్మ్డ్ రిజర్వ్ కార్యాలయంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తులతో శాస్త్రోక్తంగా వేదపండితుల సమక్షంలో ఎస్పీ సిద్ధార్థ కౌశల్, సతిమణి శమేఘ కౌశల్‌తో కలిసి 108 రకాలు పూలతో ఆయుధ పూజను చేశారు. ఈ పూజలో అత్యంత ఆధునాతన 500 ఆయుధాలకు ఎస్పీ స్వయంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఎం.టి. సెక్షన్లో అన్ని పోలీస్ వాహనలకు వాహన పూజ చేశారు. ఆర్మీ కుటుంబం నుంచి వచ్చినందున తనకు చిన్నతనం నుంచే ఆయుధపూజ చేయడం అలవాటుందని.. ఆయుధ పూజ భద్రతా దళాలకు అత్యంత ముఖ్యమైన పండగన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) బి.రవి చంద్ర గారు, ఎ ఆర్ అడిషనల్ ఎస్పీ.టీ శివారెడ్డి, ఒంగోలు డీఎస్పీ ప్రసాద్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి...