ప్రకాశం జిల్లా దర్శి మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన మంకెన అమృతరావు అతని కుమారుడు సురేష్ ఇరువురు దర్శిలో మద్యం సేవించి ఇంటికి చేరుకున్నారు. మద్యం మత్తులో వారి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. గొడవ కాస్త పెద్దది అవడంతో సురేష్,.. అమృతరావు తలపై కర్రతో బలంగా పలుమార్లు కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయాడు. అతనిని హుటాహుటిన 108 వాహనంలో దర్శి ప్రభుత్వాసుత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు ప్రథమచికిత్సనందించి పరిస్థితి విషమంగా ఉంటంతో ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అమృతరావుకి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు కలరు. సురేష్ మూడవ కుమారుడు.
ఇవీ చదవండి