ETV Bharat / state

కురిచేడులో మెడికల్​, కిరాణా దుకాణాల్లో అధికారుల తనిఖీలు - sit officers checkings at kurichedu medical shops news

ప్రకాశం జిల్లా కురిచేడులోని మెడికల్​ దుకాణాలపై ప్రత్యేక బృంద అధికారులు మంగళవారం రాత్రి దాడులు చేశారు. ఇటీవల కురిచేడులో శానిటైజర్​ తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై విచారణ చేసేందుకు ప్రభుత్వం సిట్​ను నియమించింది. విచారణలో భాగంగా శానిటైజర్​ విక్రయించే మెడికల్​ షాపులు, కిరాణా దుకాణాల్లో అధికారులు తనిఖీలు చేశారు.

కురిచేడులో మెడికల్​, కిరాణా దుకాణాల్లో అధికారుల తనిఖీలు

author img

By

Published : Aug 5, 2020, 2:16 AM IST

ప్రకాశం జిల్లా కురిచేడులోని మెడికల్​ దుకాణాల్లో.. ప్రత్యేక బృంద అధికారులు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. పలు కిరాణా దుకాణాల్లోనూ తనిఖీలు చేశారు. కురిచేడులో ఇటీవల శానిటైజర్​ తాగి 16 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్​ను నియమించింది.

అంతే కాకుండా మార్కాపురం ఓఎస్​డీ ఆధ్వర్యంలో ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు సీఐలతో ప్రత్యేక బృందాన్ని సైతం ఏర్పాటు చేసింది. ఇప్పటికే సిట్​ అధికారులు పలుచోట్ల విచారణ జరిపారు. విచారణలో భాగంగానే అద్దంకి సీఐ ఆధ్వర్యంలో శానిటైజర్​ విక్రయించే దాదాపు 32 దుకాణాల్లో తనిఖీలు చేశారు.

ఇదీ చూడండి..

అమరావతే మా రాజధాని.. న్యాయస్థానాలే మాకు దిక్కు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.