Rs.70 thousand Current Bill: సాధారణంగా నెల నెల వాడుకునే విద్యుత్‌కు రూ.200, 300 లేదా 500 చొప్పున బిల్లు వస్తుంది. కానీ ప్రకాశం జిల్లా కనిగిరిలో నివసిస్తున్న సరోజ ఇంటికి మాత్రం ఏకంగా రూ.70,000 కరెంట్ బిల్ వచ్చింది. రాజీవ్ కాలనీకి చెందిన సరోజ ఇంటికి ప్రతి నెల 300 నుండి 700 వరకు విద్యుత్ బిల్లు వస్తుండగా.. ఈ నెలలో మాత్రం ఒక్కసారిగా రూ.70,000 బిల్లు వచ్చింది. దీంతో సరోజ కుటుంబీకులు కంగుతిన్నారు. బిల్లు వచ్చినప్పటి నుండి విద్యుత్ అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ వారు స్పందించకపోవడంతో కాలనీలోని మహిళలందరూ ఒక్కసారిగా విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేశారు.
గతంలో మీటర్ అధికంగా తిరుగుతోందని ఫిర్యాదు చేయగా.. అధికారులు విద్యుత్ మీటర్‌ని పరిశీలించి ఎలాంటి పొరపాటు లేదంటూ మళ్లీ బిగించారని మహిళ ఆరోపించింది. గత ప్రభుత్వ హయాంలో 120 రూపాయలు విద్యుత్ బిల్లు వస్తుండగా.. ఈ ప్రభుత్వం వచ్చినప్పటినుండి రూ.300 నుండి 400, 500, 700 వరకు బిల్లు వస్తుందని సరోజ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నెలలో ఏకధాటిగా రూ.70 వేల వరకు బిల్లు వచ్చిందని.. బిల్లు కట్టకపోవడంతో అధికారులు విద్యుత్ సరఫరా కట్ చేశారని వాపోయారు. కూలీ చేసుకొని బతికేవాళ్లం.. అంత బిల్లు ఎలా చెల్లించాలని ఆమె బోరున విలపించింది.
ఇవీ చదవండి: