ETV Bharat / state

చినగంజాం రైల్వే వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన గజానన్​ మాల్యా

చినగంజాం రైల్వే వంతెన నిర్మాణ పనులను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పరిశీలించారు. గూడూరు నుంచి విజయవాడ వరకు ప్రత్యేక రైలులో జీఎం పర్యటించారు.

scr railway gm
చినగంజాం రైల్వే వంతెన నిర్మాణ పనులను పరిశీలించిన గజానన్​ మాల్యా
author img

By

Published : Feb 16, 2021, 9:59 PM IST

ప్రకాశం జిల్లా చినగంజాంలోని రైల్వే వంతెన నిర్మాణ పనులను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా పరిశీలించారు. గూడూరు నుంచి విజయవాడ వరకు ఆయన పర్యటించారు. మధ్యాహ్నం ప్రత్యేక రైలులో ప్రకాశం జిల్లాకు చేరుకున్న జీఎం... టంగుటూరులో కొద్దిసేపు ఆగారు. ఉప్పుగుండూరు, చినగంజాం రైల్వే స్టేషన్ల మధ్య రొంపేరు కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించారు. అక్కడే ఉన్న రైల్వే పనులు చేస్తున్న కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వంతెనపై ఉన్న రైలు పట్టాల నాణ్యతను పరిశీలించారు. చినగంజాం పట్టణానికి చెందిన ఆంజనేయులు... చినగంజాం రైల్వే స్టేషన్లో పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని జీఎంకు వినతిపత్రం అందజేశారు.

ఇదీ చదవండి: అక్రమంగా గ్రానైట్ పలకలను తరలిస్తున్న వాహనాల పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.