మంత్రి బాలినేని అనుచరుల చేతిలో దాడికి గురై వార్తల్లో నిలిచిన ఒంగోలుకు చెందిన వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాపై.. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను దూషించారంటూ ఒంగోలు మేయర్.. సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మంగమూరు సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది వైశ్యులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. విగ్రహం ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మున్సిపల్ అధికారులు అందుకు అనుమతి ఇవ్వకపోగా.. విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని అప్పగించాలంటూ సుబ్బారావు గుప్తా ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులతో కలిసి మేయర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో సుబ్బారావు గుప్తా తనను దూషించారని మేయర్ సుజాత ఫిర్యాదు చేశారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా విగ్రహాన్ని పెట్టేందుకు ప్రయత్నిస్తే.. ఇక్కడ పాలకులు వారి తండ్రి, తాతల విగ్రహాలు పెట్టాడానికి కుయుక్తులు పన్నుతున్నారని సుబ్బారావు గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి