ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయితీ పరిధిలోని రెండో సచివాలయ నిర్మాణానికి... రావూరి రోడ్డులో ఉన్న అంజనేయస్వామి దేవాలయం వెనుక స్థలాన్ని గతంలో అధికారులు కేటాయించారు. నాలుగు రోజుల క్రితం ఆ స్థలాన్ని చదునుచేసి పిల్లర్ల నిర్మాణానికి బెడ్లు వేశారు. ఈ క్రమంలో వచ్చిన ఇసుకను అక్కడే కుప్పలుగా పోశారు.
కొందరు వ్యక్తులు వేకువజామున ఈ ఇసుకను ట్రాక్టర్లతో తరలించి సొమ్ముచేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయితీ రాజ్ ఏఈని వివరణ కోరగా చల్లారెడ్డిపాలెం సచివాలయం నిర్మాణానికి ట్రాక్టర్ ఇసుక అవసరమై తీసుకెళ్లామన్నారు. ఆ ప్రాంతంలో పనులు రద్దు కాలేదని చెప్పారు. ఇనుప చువ్వలు రాని కారణంగానే పనులు ఆగాయని వివరించారు.
ఇదీ చూడండి: