అద్దంకి పట్టణ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సేవ్ గుండ్లకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ, ప్రజా సంఘాలు కలిసి ఆందోళన చేపట్టాయి. పర్యావరణ పరిరక్షణతోపాటు పాడి పంటలకు, రైతాంగానికి, వివిధ వృత్తుల వారికి ఉపాధి అందిస్తున్న గుండ్లకమ్మ నదీ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు... చర్యలు చేపట్టాలని మండల తహశీల్దార్, నగర పంచాయతీ వారికి వినతి పత్రాలు అందజేశారు. విశాలమైన ఆహ్లాదకరమైన గుండ్లకమ్మను కాలుష్యమయం నుంచి కాపాడుకుందామంటూ నినాదాలు చేశారు. అద్దంకి నగర పంచాయతీ నుంచి గుండ్లకమ్మ వరకూ ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చదవండి: