RAIN: నాగులుప్పలపాడులో రాత్రివేళ వర్షం.. రైతులకు కరువైన నిద్ర - ప్రకాశం జిల్లాలో వర్షాల వార్తలు
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులో బుధవారం రాత్రి కురిసిన వర్షం(rain) మహాపాదయాత్ర(Maha Padayathra) నిర్వహకులకు ఇబ్బంది కలిగించింది. మహా పాదయాత్రలో భాగంగా.. 10వ రోజు నడక పూర్తయిన తరువాత నాగులుప్పలపాడులో రైతులు బస చేశారు. ఆరుబయట టెంట్లు వేసుకుని నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వర్షం కురవటంతో టెంట్లు, దుప్పట్లు తడిచిపోయాయి. దాంతో రైతులకు నిద్ర కరువైంది.