ACTION ON ILLEGAL LAYOUTS: పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ లే అవుట్లకు సంబంధించిన వెంచర్లలో.. హద్దు రాళ్లను అధికారులే తొలగించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. కనిగిరి మండలంలోని నగర పంచాయతీ పరిధిలో అనుమతి లేకుండా అక్రమంగా వేసిన లే అవుట్లపై కందుకూరు సబ్ కలెక్టర్ చర్యలు చేపట్టారు. కనిగిరి ప్రాంతం నుండి జిల్లా కేంద్రాలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లే.. ప్రధాన రహదారులకు ఇరువైపులా సుమారు 102 ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పంటలు పండే భూములను రైతుల నుండి కొనుగోలు చేశారు. వాటిని ప్లాట్లుగా విభజించి అక్రమార్జనే ద్యేయంగా అనుమతులు లేకుండా క్రయవిక్రయాలు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ వ్యవహారంపై పలు విమర్శలు రావడంతో స్పందించిన అధికార యంత్రాంగం కొరడా ఝుళిపించింది. వెంచర్ల వద్దకు వెళ్లి ప్లాట్లుగా విభజించేందుకు వేసిన రాళ్లను జేసీబీ సాయంతో కందుకూరు సబ్ కలెక్టర్ అపరాజీత సింగ్ స్థానిక తహసీల్దార్ పుల్లారావులు తొలగించారు. లే అవుట్ దారులు తప్పనిసరిగా కన్వర్షన్ అనుమతి పత్రంతో పాటు లే అవుట్ అనుమతి పొందాలని జారీ చేసిన నోటీసులకు స్పందించలేదని వారు తెలిపారు. ఈ విషయంలో వ్యాపారులు సైతం అధికారులపై దాడులకు దిగుతున్నారని తహసీల్దార్ వివరించారు. శుక్రవారం నాడు హనుమంతునిపాడు మండలంతహసీల్దార్ పై జరిగిన ఘటన కూడా ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: కొత్త పీఆర్సీ హెచ్ఆర్ఏలో మార్పులు.. అక్కడ పనిచేసే వారికి 16 శాతం హెచ్ఆర్ఏ
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!