చేపల వేటకు వెళ్లిన జాలర్లకు జాక్పాట్ తగిలింది. చిన్న చేప కోసం వల వస్తే భారీ తిమింగలం చిక్కింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో జరిగింది. కర్లపాలెంకు చెందిన ఎల్ శ్రీను అనే మత్స్యకారుడు… తన బృందంతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లాడు. వల బరువుగా ఉండటం వల్ల పైకి లాగారు. తీరా చూస్తే భారీ తిమింగలం. దాదాపు టన్ను బరువు ఉంటుంది. ఒడ్డుకు చేరిన కొద్ది సేపు వరకు ప్రాణాలతో ఉండి అనంతరం మరణించింది. ఇంత పెద్ద చేప వేటలో లభించడం ఇదే తొలిసారి అంటూ మత్స్యకారులు తెలిపారు.
ఇదీ చదవండి :