ఎస్.కొత్తపల్లిలో 40 ఎకరాల దానిమ్మతోట దగ్ధమైంది. ఆస్ట్రేలియాలో ఉన్న యజమాని వెంకటరణ.. తోట సంరక్షణ బాధ్యతలను కూలి మనుషులకు అప్పగించారు. ఇవాళ సాయంత్రం తోటలో భారీగా మంటలు చెలరేగడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. రెండు అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.
రాజకీయ కక్షల నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా నిప్పంటించారా? లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తోటలోని చెట్లు సుమారు 80 శాతం మేర మంటలకు దగ్ధమయ్యాయి. దాదాపు కోటి రూపాయల మేర ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం.
ఇదీ చదవండి: