ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని ఓ రైసుమిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 65 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు అద్దంకి సీఐ రాజేశ్ తెలిపారు. ఇంత భారీ మెుత్తంలో బియ్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వస్తోంది? అనే దానిపై వారు ఆరా తీస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చేందుకు వినియోగించే బియ్యం పక్కదారి పట్టడంపై విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. దర్యాప్తు తరువాత పూర్తి సమాచారంతో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సంతమాగులూరు మండలంలో ఇదే తరహాలో ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని చెన్నైకి అక్రమంగా లారీలో తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి:
'ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. ప్రమాదరహిత శనివారంగా పాటిద్దాం'