ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కుంట, కర్రోలలో కల్తీ మద్యం పట్టుబడింది. నకిలీ మద్యం తరలిస్తున్నారనే.. ముందస్తు సమాచారం మేరకు.. గుంటూరు ఎస్ఈబీ జేడీ, ప్రకాశం అసిస్టెంట్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మిరప పంటలో దాచిన గోవాకు చెందిన.. వెయ్యి 175 కల్తీ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మద్యం తరలిస్తున్న 3 ద్విచక్రవాహనాలు, ఆటోను స్వాధీనం చేసుకుని... నలుగురుని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: