ప్రకాశం జిల్లా మార్టూరులో కరోనా జయించిన ఏఎస్ఐకు తోటి పోలీస్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. మార్టూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లకు కరోనా పాజిటివ్ నిర్దారణ కాగా.. చికిత్స పొంది తిరిగి విధులకు హాజరయ్యారు. ఇంకొల్లు సీఐ రాంబాబు, మార్టూరు ఎస్ఐ శివకుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది కరోనాను జయించిన ఏఎస్ఐపై పూల వర్షం కురిపించి, చప్పట్లతో పోలీస్స్టేషన్లోకి తీసుకెళ్లారు. అనంతరం ఆయనను శాలువతో సత్కరించారు. కరోనా కారణంగా విధి నిర్వాహణలో ఉన్న పోలీసులు జాగ్రత్తలు పాటించాలని సీఐ రాంబాబు సూచించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారిని జయించిన ఏఎస్ఐ అభినందనీయుడని కొనియాడారు.
ఇవీ చూడండి...