ఫ్లాగ్ మార్చ్ ..
ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ నెల 13వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మేదరమెట్ల, దైవాలరావూరు, రావినూతల, పమిడిపాడు, రాచపూడి గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి విభేదాలకు తావులేకుండా ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు అందరూ సహకరించాలని సీఐ ఆంజనేయరెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
అందరూ సహకరించాలి
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలంలో ఓటుపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధర్మవరం, రాచపల్లి, ఒమ్మంగి గ్రామాలలో పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ కరణం కుమార్ పర్యటించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి ఇబ్బంది కలిగిన పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన అన్నారు..ఈ కార్యక్రమం లో ప్రత్తిపాడు సీఐ రాంబాబు, ఎస్సై సుధాకర్ లు పాల్గొన్నారు.
సమస్యాత్మక గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు
విజయనగరం జిల్లా సాలూరు మండలంలో ఎన్నికల భద్రతా దృష్ట్యా పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మామిడిపల్లి, పాచిపెంట మండలం, హోసూరు గ్రామాలలో ఓఎస్డీ సూర్య చందర్రావు పర్యటించారు. ప్రజలందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సుభాష్ , సాలూరు సీఐ అప్పలనాయుడు, సాలూరు ఎస్ఐ దినకర్, మక్కువ ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'బీమా' కోసం భార్యనే చంపించిన భర్త