లాక్డౌన్ నేపధ్యంలో మద్యం అమ్మకాలు నిషేధించడంతో మారుమూల ప్రాంతాల్లో నాటుసారా ఊపందుకుంది. దానిలో భాగంగా ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించగా సుద్దకురవ తండ, పాత చెరువు సమీపాన ముగ్గురు వేర్వేరుగా నాటుసారా తరలిస్తుండగా ఆబ్కారీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 40 లీటర్ల నాటుసారా, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చదవండి