ETV Bharat / state

RAPE: వృద్ధురాలిపై ఆటోడ్రైవర్​ అత్యాచారం.. నిందితుడు అరెస్టు - prakasam district rape case updates

ప్రకాశం జిల్లాలో వృద్ధురాలిపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పండ్లు అమ్ముకునే వృద్ధురాలిపై ఈ నెల 12వ తేదీన ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు.

accused arrest
నిందితుడు అరెస్టు
author img

By

Published : Jul 16, 2021, 6:19 PM IST

ప్రకాశం జిల్లాలో 60 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12వ తేదీన చీరాలకు చెందిన వృద్ధురాలిపై అత్యాచారం జరిగింది.

వృద్ధురాలు పర్చూరు మండలం అడుసుపల్లిలో పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో రోజులాగానే చీరాలకు వచ్చేందుకు పిల్లి నాగేంద్రబాబు అలియాస్ మోజేస్(27) ఆటో ఎక్కింది. పర్చూరు మండలం బోడవాద నుంచి ఆటో మళ్లించటంతో ఆ వృద్దురాలు ప్రశ్నించింది. చెరువు వద్ద మరో ప్రయాణికుడు ఉన్నాడని.. అతనిని ఎక్కించుకుని వెళదామంటూ అమెను మభ్యపెట్టాడు. చెరువు దాటి ముందుకెళుతున్న క్రమంలో మరోసారి ప్రశ్నించింది. దగ్గర దారిలో వెళుతున్నామంటూ నమ్మించాడు. పర్చూరు-దేవరపల్లి మద్య రహదారిలో వృద్ధురాలిని సమీప పొలాల్లొకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు.

రాత్రి 10 గంటల సమయంలో అటుగా వెళ్తున్న ట్రాక్టర్​ను ఆపి.. తనకు జరిగిన ఆన్యాయాన్ని తెలిపింది ఆ వృద్ధురాలు. అనంతరం పోలీసులను అశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని ఉప్పుటూరు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి ఆటోను సీజ్ చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ... లొంగిపోయిన నిందితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.