ETV Bharat / state

' రహదారి నిర్మాణం చేపట్టకుంటే ఆందోళన చేస్తాం' - ప్రకాశంలో రహదారుల పరిస్థితి వార్తలు

చీరాల నుంచి కొత్తపేటకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారిందని సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు అన్నారు. రహదారి మధ్యలో గుంతలు ఏర్పడడంతో ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన చెప్పారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

peoples facing problems due to road damage at cheerala
' రహదారి నిర్మాణం చేపట్టకుంటే ఆందోళన చేస్తాం'
author img

By

Published : Dec 15, 2020, 5:13 PM IST

ప్రకాశం జిల్లా చీరాల నుంచి కొత్తపేటకు వెళ్లే రహదారిపై పెద్ద గుంత ఏర్పడటంతో ప్రజలు ప్రమాదాలబారిన పడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్​ బాబు తెలిపారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేటు ఆసుపత్రులు కూడా ఇదే మార్గంలో ఉండడంతో 108 వాహనాలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గతంలోనూ మూడు చోట్ల రోడ్డు కుంగిపోగా తూతూమంత్రంగా మరమ్మతులు చేశారని చెప్పారు.

గుంతను పూడ్చి శాశ్వత రహదారిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు సమస్యను పరిష్కరించాలని... లేకపోతే ఆందోళనలు చేస్తామని సయ్యద్ బాబు హెచ్చరించారు

ఇదీ చదవండి : పోలీసులే అన్నదాతలకు న్యాయం చేయాలి: సీపీఐ రామకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.