ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పట్టణంలో కోతుల బెడదతో కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉట్ల స్తంభాల, వస్తాద్ గారి వీధుల్లో వానరాలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. ఇంటి పరిసరాలల్లో తిరుగుతూ... అందిన వస్తువులను తీసుకెళ్తున్నాయి. కోతులు సంచరిస్తున్నప్పుడు బయటికి వస్తే దాడి చేస్తాయని స్థానికులు భయపడుతున్నారు.
ఇదీ చదవండి: ఔదార్యం.. గూడు లేని వృద్ధురాలికి ఇల్లు కట్టిచ్చిన ఎస్సై