కరోనా కారణంగా సామాన్య ప్రజల జీవనోపాధి స్తంభించిపోయింది. లాక్డౌన్ ఉండటంతో పిల్లలందరూ ఇంటివద్దనే ఉంటున్నారు. బతకడానికి కష్టమవుతుందని విద్యార్థులను కూడా తల్లిదండ్రులు వారితోపాటు పనులకు తీసుకెెళ్తున్నారు. వారందరూ ఆటోలో ఎక్కువమంది కలిసి వెళ్తున్నారు. కరోనా వస్తుందని తెలిసినా..ప్రయాణాలు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా దర్శి చుట్టుపక్కల ప్రాంతాలలో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పత్తి, మిరప, వరి మొదలైన పంటలలో కలుపు, కోతలకు కూలీలు అవసరం కావడంతో దర్శిలోని వ్యవసాయ కూలీల కోసం రైతులు ఆటోలను మాట్లాడుకొని పంపుతారు. ఆటోవారు గిట్టుబాటు కోసం ఒక్కో ఆటోలో సుమారు 15 నుంచి 20 మందిని తీసుకుని వెళుతుంటారు. ఆ ప్రయాణం ఎంతో ప్రమాదకరమని తెలిసినా.. పొట్టకూటి కోసం వెళ్లాల్సిన పరిస్థితి అని కూలీలు వాపోతున్నారు. ముఖ్యంగా ఆటోవాళ్లు కానీ, రైతులు కానీ కూలీల కోసం రక్షణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. కరోనా కారణంగా కూలీలు పనులకు వెళ్లకుండా ఇంటివద్దనే ఉన్నారు. ఇటీవల పొలాల్లో వ్యవసాయ పనులు చేస్తుండటంతో.. వారి పిల్లలను కూడా వారితోనే తీసుకెళ్తున్నారు
ప్రధాన రహదారులలో ఒక్కో ఆటోలో అంతమంది ప్రయాణిస్తున్నా రవాణాశాఖ కానీ, పోలీసులు పట్టించుకోవడం లేదు. ఆటోలలో ప్రయాణిస్తూ ఎంతో మంది వ్యవసాయ కూలీలు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి.
ఇదీ చూడండి. ఆదోనిలో సింపుల్గా పెళ్లి...విందు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!