ETV Bharat / state

దర్శిలో ఆపరేషన్ ముస్కాన్: బాల కార్మికులకు కౌన్సెలింగ్

ప్రకాశం జిల్లా దర్శిలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని చేపట్టారు. వివిధ దుకాణాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి.. కౌన్సెలింగ్ ఇచ్చారు.

Operation Muskan in Darshi- Counseling for child labor
దర్శిలో ఆపరేషన్ ముస్కాన్- బాల కార్మికులకు కౌన్సెలింగ్
author img

By

Published : Oct 28, 2020, 9:48 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో పోలీసులు బాల కార్మికులను గుర్తించారు. కౌన్సెలింగ్ ఇచ్చారు. విద్య, ఉద్యోగాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులకు కూడా వారి పిల్లలను బడికి పంపాలని సూచించారు.

బాలకార్మిక చట్టాన్ని అమలు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ప్రకాశరావు తెలిపారు. ఇప్పటివరకు దర్శి సబ్ డివిజన్లలో 153 మంది బాలకార్మికులను గుర్తించామని.. జిల్లాలోని సీడబ్ల్యూసీకి వారి వివరాలు తెలియజేస్తామని ఆయన వివరించారు. దర్శి ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

ఆపరేషన్ ముస్కాన్: 12 మంది బాలలకు విముక్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.