ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రాధేష్ మురళీని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు డీఎస్పీగా తన పరిధిలో ఉన్నా ఒంగోలు, చీమకుర్తి ప్రాంతంలో గుట్కా వ్యాపారం జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారన్న కారణంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంతవరకూ 32 గుట్కా కేసులు కోర్టులో ఉన్నాయి. అడపాదడపా పోలీసులు దాడులు నిర్వహిస్తుండటం, వ్యాపారులను అరెస్టు చేస్తుండటం జరుగుతుంది. కేసులు సంఖ్య ఎక్కువవుతుండటం వల్ల కొన్ని కేసుల విషయంలో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుపై చర్యలు
ఈ నెల 22న ఒంగోలుకు చెందిన ఓ గుట్కా వ్యాపారిపై విజిలెన్సు అధికారుల దాడి చేసి భారీ ఎత్తున గుట్కా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయమని విజిలెన్సు అధికారులు లేఖ రాశారు. అయినా కేసు నమోదు కాలేదు. మరోసారి ఈ నెల 27న విజిలెన్స్ అధికారులే దాడులు నిర్వహించగా అదే వ్యాపారి గుట్కాతో పట్టుపడ్డాడు. వారం రోజులు కాకముందే అదే వ్యాపారి అక్రమ వ్యాపారంతో పట్టుపడినా, పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడంలేదని జిల్లా ఎస్పీకి విజిలెన్స్ డీఎస్పీ రజినీ ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేయని కారణంగా రాధేష్ మురళీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వాస్తవానికి శుక్రవారం బదిలీలు జరగగా అందులో రాధేష్ మురళీ కూడా ఉండాలి. కానీ బదిలీ కాకుండా సస్సెండ్ కావడం చర్చనీయాంశమైంది.
ఒంగోలు డీఎస్పీ రాధేష్ మురళీపై సస్పెండ్ వేటు - ongole dsp radesh muralu susupanded due to register no cases on gutka business
తన పరిధిలోని ప్రాంతాల్లో గుట్కా వ్యాపారం జరుగుతున్నా చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న కారణంతో ఒంగోలు డీఎస్పీ రాధేష్ మురళీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బదిలీ జరగాల్సిన రోజే సస్పెండ్ వేటు పడటం చర్చనీయాంశమైంది.
ప్రకాశం జిల్లా ఒంగోలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రాధేష్ మురళీని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒంగోలు డీఎస్పీగా తన పరిధిలో ఉన్నా ఒంగోలు, చీమకుర్తి ప్రాంతంలో గుట్కా వ్యాపారం జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తున్నారన్న కారణంతో ఆయన్ను సస్పెండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇంతవరకూ 32 గుట్కా కేసులు కోర్టులో ఉన్నాయి. అడపాదడపా పోలీసులు దాడులు నిర్వహిస్తుండటం, వ్యాపారులను అరెస్టు చేస్తుండటం జరుగుతుంది. కేసులు సంఖ్య ఎక్కువవుతుండటం వల్ల కొన్ని కేసుల విషయంలో పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
విజిలెన్స్ అధికారుల ఫిర్యాదుపై చర్యలు
ఈ నెల 22న ఒంగోలుకు చెందిన ఓ గుట్కా వ్యాపారిపై విజిలెన్సు అధికారుల దాడి చేసి భారీ ఎత్తున గుట్కా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయమని విజిలెన్సు అధికారులు లేఖ రాశారు. అయినా కేసు నమోదు కాలేదు. మరోసారి ఈ నెల 27న విజిలెన్స్ అధికారులే దాడులు నిర్వహించగా అదే వ్యాపారి గుట్కాతో పట్టుపడ్డాడు. వారం రోజులు కాకముందే అదే వ్యాపారి అక్రమ వ్యాపారంతో పట్టుపడినా, పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడంలేదని జిల్లా ఎస్పీకి విజిలెన్స్ డీఎస్పీ రజినీ ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేయని కారణంగా రాధేష్ మురళీని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వాస్తవానికి శుక్రవారం బదిలీలు జరగగా అందులో రాధేష్ మురళీ కూడా ఉండాలి. కానీ బదిలీ కాకుండా సస్సెండ్ కావడం చర్చనీయాంశమైంది.
Body:నరసన్నపేట
Conclusion:9440319788