ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గొల్లపల్లి సమీపంలో ఆయిల్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కూచిపూడిపల్లికి చెందిన బండారు అనిల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. లక్ష్మణరావు అనే యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వైద్యం కోసం ఒంగోలు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:కొమరోలులో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం