ETV Bharat / state

మూగజీవాలంటే ఇంత మమకారమా!

ఉపాధినిచ్చే గోమాత మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. లక్ష్మీ అని ముద్దుగా పిలుచుకునే ఆవు... ఇలా కాలం చేయడం జీర్ణించుకోలేకపోయిందా మహిళ. లక్ష్మీ లేనిదే తాను బతలేనని... చచ్చిపోతానని విలపిస్తున్న ఘటన అందర్నీ ఆశ్చర్యపరిచింది.

nomadic-life-difficulties-
ఆవు మృతిచెందిందని మహిళ ఆవేదన
author img

By

Published : Jan 4, 2021, 6:26 AM IST

ఆవు మృతిచెందిందని మహిళ ఆవేదన

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఆవు మృతిచెందడం వల్ల ఉపాధి కోల్పోయానని ఓ మహిళ కన్నీటి పర్యాంతమైంది. తర్లుపాడు మండలం నాగేండ్ల ముడుపు నివాసి అయిన జడ బాలమ్మ ఆవును పెంచుకుంటుంది. దానికి లక్ష్మి అని పేరు పెట్టి, సొంత బిడ్డలా చూసుకుంటుంది. బతుకుదెరువు కోసం ఆమె ఒంగోలు నగరానికి వచ్చింది. ఇంటింటికి తిరుగుతూ గోమాతతో ఆశీస్సులు అందజేసేది. వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తోంది. ఆవు ఇటీవల ఓ దూడకు జన్మనివ్వగా పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. తిరిగి ఇంటికి తీసుకొస్తుండగా గోమాత ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

జీవనాధారమైన ఆవు మృతిచెందడంతో బాలమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. ఆమె రోదనలు చుట్టుపక్కలవారిని సైతం కదిలించాయి. బాలమ్మ దీనస్థితి గురించి తెలిసి ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు స్పందించారు. తన కార్యకర్తలతో రూ.10వేలు ఆర్ధిక సాయాన్ని అందించారు. తర్లుపాడు మండలం నాగేండ్ల ముడుపు గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలు ఇలా పశువులను ఆడించి జీవనం సాగిస్తున్నారు. వారికి ప్రభుత్వం తగిన సాయం అందించాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'మంత్రి సమక్షంలో.. మత్స్యకార గ్రామాల సమస్యలను పరిష్కరిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.