నివర్ తుపాన్ కారణంగా ప్రకాశం జిల్లాలో ఈదురు గాలులు బలంగా వీస్తున్నాయి. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తుండటం వల్ల పలుచోట్ల వృక్షాలు నేలకూలాయి. కుందుకూరు రహదారి, కనపర్తికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలింది. రహదారిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పోలీసులు చెట్లను తొలగించి వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు. రాచర్ల మండలం ఆకివీడులో నివాసాలు మధ్య ఉన్న బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ కూలింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవటం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ఇదీచదవండి