ప్రకాశం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో తల్లీబిడ్డ మృతి చెందారు. టంగుటూరుకు చెందిన బి. మాధురి(22) పది రోజుల క్రితం ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్లింది. 29న ఆమెకి పురిటి నొప్పులు రావడంతో వైద్యులు డెలివరీ చేశారు. మాధురి మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు బలహీనంగా ఉండడంతో పాటు కొంతసేపటికి ఆమె ఆరోగ్యం క్షీణించింది. బంధువులు వెంటనే వైద్యులకు సమాచారం అందించారు. ఆమెకు చికిత్స అందిస్తుండగానే ఒకే సమయంలో బాలింత, పసిబిడ్డ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీబిడ్డలు చనిపోయారని ... బంధువులు ఆరోపించారు.
ఇదీచూడండి. అర్ధరాత్రి ఉద్రిక్తత: వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ