ప్రకాశం జిల్లాలోని కంభం సమీపంలోని కంభం చెరువును సందర్శించడానికి.. ఓ విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కుటుంబంతో బయలుదేరారు. మార్కాపురం నుంచి ఇన్నోవా వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. తిరుగు ప్రయాణంలో.. వారి వాహనం కంభం రహదారిపై నున్న హీరో షోరూమ్ వద్ద డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారి వెనుక వస్తున్న గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గమనించి సహాయం అందించారు. 108 వాహనంలో కంభం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని ఒంగోలు రిమ్స్‌కు పంపించాలని వైద్యులు ఎమ్మెల్యేకు తెలిపారు. తన సొంత ఖర్చుతో ఆయన అంబులెన్స్ ఏర్పాటు చేసి.. బాధితులను తరలించారు.
ఇదీ చదవండి: