MLA Anna Rambabu: ‘లబ్ధిదారులు ఇళ్లు కట్టుకునేందుకు కడప, నెల్లూరు వెళ్లి టిప్పర్లలో ఇసుక తెచ్చుకుంటుంటే అది అక్రమం అంటూ.. సెబ్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్నా.. తమ వద్దకు వెంటనే రావాలంటూ బెదిరింపులకు గురి చేశారు. అదే సమయంలో నాటు సారా తయారీని వదిలి.. రంగు కలిపిన పీపాల్లోని నీటిని కింద పారబోసి నియంత్రించామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదేం తీరు...’ అని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు(వైకాపా) ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఒంగోలులో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాంబాబు సెబ్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గిద్దలూరు నియోజకవర్గంలో లబ్ధిదారులు నానా కష్టాలు పడి ఇతర జిల్లాల నుంచి ఇసుక తెచ్చుకుంటుంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాటు సారాను వదిలి.. నిర్మాణానికి తెచ్చుకున్న ఇసుక నిల్వలపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వారు పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తిరగబడే పరిస్థితి వస్తుందన్నారు.
ఇదీ చదవండి:
తుడా చైర్మన్ పదవీకాలం పొడిగింపు.. మరో రెండేళ్లు కొనసాగనున్న చెవిరెడ్డి