Minister Vidadala Rajini Convoy: ప్రకాశం జిల్లా మర్కాపురం సమీపంలో మంత్రి విడదల రజిని కాన్వాయ్‌లోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. మార్కాపురంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మంత్రులు విడదల రజిని, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి బాలినేని హాజరయ్యారు. ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత కొనకనమిట్ల మండలానికి మంత్రి విడదల రజిని కాన్వాయ్ బయలుదేరింది. ఈ క్రమంలో కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న ఇన్నోవా వాహనాన్ని మంత్రి ఉన్న వాహనం డీకొట్టింది. మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది.
ఇవీ చదవండి: