కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లో ఒంగోలు రిమ్స్ వైద్యాధికారులతో మంత్రి సమీక్షించారు. కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకునేలా వైద్యులు కృషిచేయాలని సూచించారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. మెడికల్ స్టాప్‌ను పెంచేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు మార్గనిర్దేశం చేశారు. సంబంధిత మందులు అందుబాటులో ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ రెండు నెలలు ఇక్కడే ఉండి బాధితులను ఆదుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదీ చదవండి..రాష్ట్రంలో కొత్తగా 24,171 కరోనా కేసులు, 101 మరణాలు